ఏకే 47 క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

ఏకే 47 క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు

సిద్దిపేట, వెలుగు : జిల్లాలోని చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు ఏఆర్​ఆర్ముడ్​పోలీస్ హెడ్ క్వార్టర్ లో మంగళవారం గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్​అయి ఓ హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం..సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన సుతారి రాజశేఖర్ 2013 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్ గా పోలీస్ ఏఆర్​ఆర్ముడ్​హెడ్ క్వార్టర్స్ లో డ్యూటీ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పీఎస్​పరిధిలో మాబులేషన్ నిర్వహించిన ఆయుధాలను మంగళవారం ఏఆర్​ పోలీస్ ఆర్మ్ డ్ క్వార్టర్స్ లో రాజశేఖర్ క్లీన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఓ ఏకే47 గన్ లో ఉండే చీప్ కదలడంతో బుల్లెట్ దూసుకువచ్చి అతడి కుడి భుజాన్ని, కుడికన్నును తాకుతూ వెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ రాజశేఖర్ ను  పోలీసులు  సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఫస్ట్​ఎయిడ్​చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్​లోని సరోజిని ఐ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు.