జీవితం అంటే ఇదే : ఇద్దరు స్నేహితులు…ఒకరు డీఎస్పీ కాగా..మరొకరు బెగ్గర్..? ఎందుకు..?

జీవితం అంటే ఇదే : ఇద్దరు స్నేహితులు…ఒకరు డీఎస్పీ కాగా..మరొకరు బెగ్గర్..? ఎందుకు..?

బ‌ళ్లు ఓడ‌లు అవ్వ‌డం.. ఓడ‌లు బ‌ళ్లు అవ్వ‌డం మానవ జీవితంలో మామూలే. అప్పటి వరకు మనకళ్లకు హీరోల్లా కనిపించిన వాళ్లు ఒక్కసారిగా మాయం అవుతుంటారు. మాయమైన మనుషులు సర్వం కోల్పోయి రోడ్డున పడుతుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్  సీన్స్ డైరక్టర్ బాల సినిమాల్లో ఉంటాయనుకుంటే పొరపాటే. నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అందుకు ఉదంతమే ఈ స్టోరీ.

15ఏళ్ల క్రితం ఆయనో టాప్ షూటర్, అథ్లెట్. ఓ స్టేషన్ ఎస్సై. అదే ఎస్సై 15సంవత్సరాల తరువాత ఉండడానికి నిలువనీడ లేక, ఆకలితో ఆలమటిస్తూ ఫుట్ పాత్ పైన వచ్చేవారిని, పోయేవారిని బెగ్గింగ్ చేస్తూ వారిచ్చే తినుబండరాలతో కడుపు నింపుకుంటే ఎలా ఉంటుంది.

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో నవంబర్ 10న సాయంత్రం ఎన్నికలు విధులు నిర్వహించేందుకు డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ అతని సహోద్యోగి విజయ్ బహుదోరియాలు పోలీస్ జీప్ లో వెళుతున్నారు. ఆదే సమయంలో ఓ ఫుట్ పాత్ పైనే ఓ వ్యక్తి చింపిరి జుట్టు తో చలికి వణికిపోతున్నారు. ఆకలికి తట్టుకోలేక స్థానికుల్ని తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అంటూ బ్రతిమలాడుతున్నాడు. అతన్ని చూసిన డీఎస్పీ రత్నేష్ తో పాటు విజయ్ లు సాయం చేసేందుకు వెళ్లారు. ధరించిన స్వెటర్ తో పాటు, వేసుకోమని షూ ఇచ్చారు. అనంతరం మాటలు కలపగా..డీఎస్పీ రత్నేష్ సింగ్ తోమర్ ను గుర్తు పట్టాడు సదరు బెగ్గింగ్ చేసే వ్యక్తి. దీంతో షాక్ తిన్న తోమర్ పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తోమర్ స్నేహితుడే మనీష్ మిశ్రా. తోమర్ గ్వాలీయర్ క్రైం బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తుండగా అతని స్నేహితుడు మనీష్ మిశ్రా బెగ్గర్ గా ఎందుకు మారాడో అర్ధం కాలేదని అన్నారు.

బెగ్గర్ గా ఉన్న మనీష్ మిశ్రా పోలీస్ అధికారి. 1999లో తన స్నేహితుడు. షార్ప్ షూటర్. అంతేకాదు మధ్య ప్రదేశ్ లోని పలు పోలీస్ స్టేషన్ లో అధికారిగా విధులు నిర్వహించినట్లు చెప్పారు డీఎస్పీ తోమర్. కానీ సడెన్ గా 2005 దౌతియా పోలీస్ స్టేషన్ లో  ఎస్సైగా పనిచేస్తుండగానే మిసయ్యాడు. మళ్లీ ఇప్పుడు తన కళ్లెదుట స్నేహితుడు బెగ్గర్ గా కనిపించడంతో డీఎస్పీ కన్నీటి పర్యంతరమయ్యారు. వెంటన్ అంబులెన్స్ సాయంతో అత్యవసర ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. కొంచెం ఆరోగ్యం కుదుటపడగానే నీట్ గా కటింగ్ చేయించారు. ఓ స్వచ్ఛంద సంస్థతో మాట్లాడిన డీఎస్పీ తోమర్ .., తన స్నేహితుడు మనీష్ మిశ్రాను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. తాను ఎన్నికల విధుల్లో ఉన్నానని, మళ్లీ వస్తానని తెలిపారు. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.