రీ రిలీజ్ సినిమాలతో నష్టపోతున్నాం.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

రీ రిలీజ్ సినిమాలతో నష్టపోతున్నాం.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఈ మధ్య టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. మహేష్ పుట్టిన రోజు సంధర్బంగా పోకిరి(Pokiri) సినిమా రీ రిలీజ్ చేయడంతో మొదలైన ఈ ట్రెండ్.. అలా కంటిన్యూ అవుతూ వస్తోంది. వీటికి కూడా థియేటర్స్ వద్ద నా నా హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ రీ రిలీజ్ సినిమాల తమ సినిమాలకు ఎఫెక్ట్ పడుతోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత అప్పిరెడ్డి(Appireddy). 

తాజాగా ఆయన నిర్మాణంలో వచ్చిన మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్(Mister pregnent). బిగ్ బాస్ ఫేమ్ సోహెల్(Sohel) హీరోగా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే రోజు ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన యోగి(Yogi), ధనుష్(Dabush) హీరోగా వచ్చిన రఘువరన్ బీటెక్(Raghuvaran b.tech) సినిమాలు కూడా రీ రిలీజ్ అయ్యాయి. దీంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. 

ఇదే విషయంపై ఆ చిత్ర నిర్మాత అప్పిరెడ్డి స్పందించారు.. చిన్న సినిమాలకు వీకెండ్‌ స్కోప్‌ దొరకడం అంటే చాలా కష్టం. అలాంటి సమయంలో రీ రిలీజ్‌లు పెట్టుకోవడం వల్ల మాలాంటి చిన్న నిర్మాతలకు ఇబ్బంది కలుగుతోంది. అలా అని నేను రీరిలీజ్‌ చిత్రాలను వ్యతిరేకం కాదు. కానీ చిన్న సినిమాలు విడుదలయ్యే రోజు మాత్రం రీరిలీజ్‌ చేయొద్దని నా విజ్ఞప్తి. అది కూడా వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో చేస్తే బాగుంటుంది. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు అప్పిరెడ్డి.