టీకాలను కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం

టీకాలను కలిపి తీసుకుంటే చాలా ప్రమాదం

న్యూ ఢిల్లీ: టీకా తీసుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున రెండు వ్యాక్సిన్ లను కలిపి తీసుకుంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. వేర్వేరు టీకాలను మిక్స్ చేసి తీసుకుంటే అలసట, తలనొప్పి లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలుస్తోంది. ఈ విషయంపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చేసిన రీసెర్చ్ వివరాలు లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా కొందరికి తొలి డోస్ గా ఆస్ట్రా జెనేకా, ఫైజర్ వ్యాక్సిన్ ను రెండో డోస్ గా ఇచ్చారు. ఒకే కంపెనీ టీకాను తీసుకున్న వారితో రెండు రకాల వ్యాక్సిన్ లను తీసుకున్న వారిని పోలిస్తే వీరిలో పలు సైడ్ ఎఫెక్ట్స్ ను పరిశోధకులు గుర్తించారు. వేర్వేరు కంపెనీల టీకాను తీసుకున్న వారిలో హెడెక్, అలసట లాంటి సమస్యలను గుర్తించారు. ఈ రీసెర్చ్ లో 50 ఏళ్లకు పైబడిన వారే పాల్గొన్నారు. ఒకవేళ యువకుల మీద ఈ పరిశోధన చేస్తే మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రీసెర్చర్స్ పేర్కొన్నారు.