జల్సాలకు అలవాటు పడి కటకటాల్లోకి బైక్ దొంగలు 

జల్సాలకు అలవాటు పడి కటకటాల్లోకి బైక్ దొంగలు 

హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు రూ.11లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పిన వివరాల ప్రకారం..పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రెహమాన్, ఇమాన్ హక్ అనే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఈ ఇద్దరు చందానగర్ ప్రాంతంలో ఉంటూ ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలో పని చేసేవాళ్లు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి.. కొంతకాలంగా టూవీలర్స్ ను చోరీ చేస్తున్నారు.

పార్కింగ్ చేసి ఉన్న వాహనాల తాళాలను ఎలా తొలగించాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి.. చోరీలకు పాల్పడుతున్నారు. ఈనెల 22వ తేదీన మియాపూర్ లో వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విచారణలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్టుగా ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు. ఇద్దరినీ రిమాండ్ కు పంపించారు.