అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటమి భయం పట్టుకుంది : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటమి భయం పట్టుకుంది : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీపై, జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్​ అయ్యారు. ఆదివారం జగిత్యాలలోని ఇందిరాభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు. దేవుని పేరు చెప్పి జై శ్రీరామ్ అంటే ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు.

ప్రజలకు అంతా తెలుసని, వారు ఆలోచించి ఓట్లేస్తారన్నారు. జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, దమ్ముంటే 18 మండలాల్లో ఏ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా వెళ్లి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. సోమవారం జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, లక్ష్మణ్ కుమార్, శంకర్, మోహన్  పాల్గొన్నారు.

పెగడపల్లి, వెలుగు: బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏనాడూ రైతులను పట్టించుకోలేదని, ప్రస్తుతం దొంగ దీక్షలు చేస్తూ ప్రేమ నటిస్తున్నారని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఆదివారం పెగడపల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రైతుల భూములు గుంజుకొని ధర్మపురి నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేదన్నారు.

మిల్లర్లు కటింగ్ పేరుతో రైతులను మోసం చేసినా కనీసం స్పందించలేదన్నారు. 24న గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారని, కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శోభారాణి, లీడర్లు పాల్గొన్నారు.