రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి

రైతులకు అండగా ప్రభుత్వం : ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి
  • ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి 

నవాబుపేట, వెలుగు : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని బాలాజీ మార్కెట్​యార్డులో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలకు ప్రభుత్వం మద్దతు ధర అందజేస్తుందని చెప్పారు. రైతులకు సరైన సమయంలో బిల్లులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

అనంతరం రుద్రారం గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ చైర్మన్ హరలింగం, వైస్​ చైర్మన్​తులసీరాంనాయక్, సింగిల్​విండో చైర్మన్​ నర్సిములు, నాయకులు వెంకటేశ్​గౌడ్, భూపాల్​రెడ్డి, హమీద్​మహేక్, సత్యం, శివకుమార్, కరణం ప్రతాప్, ఎంపీడీవో జయరాంనాయక్, వ్యవసాయాధికారి కృష్ణాకిశోర్ పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతే

మిడ్జిల్, వెలుగు : బీఆర్ఎస్ హయాంలో ప్రతి పథకంలో అవినీతి జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. సోమవారం మిడ్జిల్ మండలం చిల్వేరు గ్రామంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో కల్యాణలక్ష్మి రావాలంటే రూ.10 వేలు దళారులు దండుకునేవారని ఆరోపించారు. 

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం 

జడ్చర్ల టౌన్, వెలుగు : నియోజకవర్గ కేంద్రంలోని గంగాపురం కాటన్ మార్కెట్ ప్రాంగణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు.