
డిచ్పల్లి, వెలుగు: రాష్ట్రంలో గొల్ల, కురుమల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పాటు అందించిదని రూరల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గొల్ల కురుమలు ఆర్థికంగా వృద్ధి చెందడానికి సబ్సిడీ గొర్రెల పంపిణీని కేసీఆర్ ప్రారంభించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకోని గడప రాష్ట్రంలో ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీటీసీ జగన్, ఐడీసీఎంఎస్ చైర్మెన్మోహన్, యాదవ సంఘం లీడర్లు మహిపాల్ యాదవ్, నర్సయ్య, రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.