
గద్వాల, వెలుగు: మహిళల వ్యాపార అభివృద్ధి కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ చేయూత అందిస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని నీతి అయోగ్ అస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు తయారుచేసిన హ్యాండ్లూమ్ వస్త్రాలు పట్టుచీరలు సేంద్రియ ఉత్పత్తులు పర్యావరణహిత వస్తువులు క్రాప్ట్స్, ఆహార పదార్థాలను పరిశీలించారు.