
నారాయణపేట, వెలుగు: బాలికలు చదువు మధ్యలో మానేయొద్దని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్లో ముదిరాజ్ ఎంప్లాయ్స్అండ్ప్రొఫెషనల్స్అసోషియేషన్ ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన ముదిరాజ్ విద్యార్థులకు, కొత్తగా ఉద్యోగం పొందిన యువకులకు, పదోన్నతి పొందిన ఉద్యోగులకు మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యతోనే ప్రగతి సాధించవచ్చని చెప్పారు. ఎక్కువ మార్కులు సాధించినవారిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉండడం సంతోషంగా ఉందన్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. రాష్ట్ర ముదిరాజ్ కమిషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్‌లను బీసీ–డి కేటగిరీ నుంచి బీసీ–ఎ కేటగిరీలోకి మార్చుతుందన్న నమ్మకం ఉందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ నాయుడు, ముదిరాజ్‌సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్ నాగరాజు, ముదిరాజ్ కమిటీ రాష్ట్ర నాయకుడు సంజీవ్ ముదిరాజ్, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు కాంత్‌కుమార్ తదితరులున్నారు