
సత్తుపల్లి, వెలుగు : పట్టణంలోని నాళాల పూడికతీత పనులు, మండల పరిధిలోని ఆయా లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే దంపతులు డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్ శనివారం పరిశీలించారు. మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి కాలనీల్లో పర్యటించారు. వరద నీటిని మళ్లిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.