మల్యాలలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : భూక్యా మురళీనాయక్

మల్యాలలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి : భూక్యా మురళీనాయక్
  • ఎమ్మెల్యే డాక్టర్​ భూక్యా మురళీనాయక్ 

మహబూబాబాద్ అర్బన్​, వెలుగు:  మహబూబాబాద్​ మండలం మల్యాల గ్రామంలోనే హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, కొంతమంది ఇక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అలా  చేస్తే ఉద్యమిస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. గురువారం ప్రభుత్వ ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  యూనివర్సిటీకి కావాల్సిన సరిపడా స్థలం ఉందని, మల్యాల గ్రామం పరిశోధనలకు కేరాఫ్ గా ఉందని, దేశంలోనే గ్రామానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉందన్నారు. 

ఉన్నతాధికారులతో మాట్లాడి మల్యాలలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కావాల్సిన స్థలాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.  ఎమ్మెల్యే డాక్టర్​ భూక్యా మురళీ నాయక్ కి మల్యాల గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.  కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, లీడర్లు పాల్గొన్నారు.