సొంత పార్టీ లీడర్లనే కేసీఆర్ కొంటున్నరు

సొంత పార్టీ లీడర్లనే కేసీఆర్ కొంటున్నరు

హైదరాబాద్, వెలుగు : మునుగోడులో నిర్వహించనున్న అమిత్ షా సభకు సీఎం కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్ని చేసినా టీఆర్ఎస్ ను ఓడించాలని అక్కడి జనం డిసైడ్ అయ్యారని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఈటల మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడులో 21న సభ పెట్టాలని చాలా రోజుల క్రితమే బీజేపీ నిర్ణయించింది. కానీ కాళ్లల్లో కట్టె పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఆగమేఘాల మీద అక్కడ టీఆర్ఎస్ సభ పెడుతున్నారు” అని ఆయన మండిపడ్డారు.

పలువురు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘‘టీఆర్ఎస్ నేతలు పార్టీ మారకుండా ఉండేందుకు.. మునుగోడులో సొంత లీడర్లనే కేసీఆర్ కొంటున్నారు. కానీ ఎంత భయపెట్టినా అక్కడి నేతలు బీజేపీలో చేరుతున్నారు” అని తెలిపారు.