మదనాపురం, వెలుగు: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని అజ్జకొల్లు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. మండల కేంద్రంలో రూ.42 లక్షలతో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంక్ పనులకు, వడ్డెర కాలనీలో రూ.12 లక్షలతో అంగన్వాడీ బిల్డింగ్కు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, నాయకులు మహేశ్, జగదీశ్, వెంకటనారాయణ, నాగన్న యాదవ్, వడ్డే కృష్ణ పాల్గొన్నారు.
