ఎమ్మెల్యే రేషన్​కార్డు ఇచ్చిన్రు.. రెవెన్యూ ఇన్​స్పెక్టర్ గుంజుకున్నరు

ఎమ్మెల్యే రేషన్​కార్డు ఇచ్చిన్రు..  రెవెన్యూ ఇన్​స్పెక్టర్ గుంజుకున్నరు
  • తహసీల్దార్ ఆఫీస్ ​ముందు బాధిత కుటుంబం ఆందోళన 

వైరా, వెలుగు: తమకు రేషన్​కార్డు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి లాగేసుకున్నారని వైరా తహసీల్దార్​ ఆఫీస్​ముందు బాధిత కుటుంబం ఆందోళన చేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన దేవభక్తిని శ్రావణి, నగేశ్ కు రెండు రోజుల కింద స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ తన క్యాంప్ ఆఫీసులో కొత్త రేషన్​కార్డు అందజేశారు. కాగా రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ వెంకటేశ్వరరావు బుధవారం శ్రావణి ఇంటికి వెళ్లి కొత్త రేషన్​కార్డుతోపాటు పిల్లలు, ఇంటి ఫొటోలు తీసుకెళ్లారు. మంజూరు చేసిన కార్డును తిరిగి ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని బాధితురాలు కుటుంబంతో కలిసి తహసీల్దార్​ఆఫీస్​ముందు ఆందోళన చేసింది. ఈ ఘటనపై ఆర్ఐ వెంకటేశ్వరావును వివరణ కోరగా నగేశ్​కుటుంబ సభ్యుల పేరు మీద సుమారు 9 ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆ కారణంతోనే కార్డును తిరిగి తీసుకున్నామని చెప్పారు.