నాగర్‌కర్నూల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం వెల్దండ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న మట్ట యాదమ్మ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు.
కాంగ్రెస్ కు చెందిన వారిని వార్డు సభ్యులు, సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని సీఎంకు బహుమతిగా ఇవ్వడానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని కోరారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాయితి ఆశాదీప్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వంగూరులో జర్నలిస్ట్ జువ్వ కృష్ణయ్య నామినేషన్ వేశారు.
