నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యం : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యం : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు:  రైతులకు నాణ్యమైన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.  రైతుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. గురువారం కల్వకుర్తి, వెల్దండ, చారగొండ మండలాల రైతులకు 50  విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నియోజకవర్గంలో కరెంటు లో వోల్టేజీ సమస్య లేకుండా చేస్తామన్నారు.  రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచులు ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి నాయకులు అశోక్ రెడ్డి సంజీవ్ యాదవ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.