- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, వెలుగు : కాంగ్రెస్ప్రభుత్వం అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ యార్డులను మరింత ఆధునీకరిస్తామన్నారు.
రైతులు తమ ధాన్యంలో తేమ, తాలు లేకుండా చూసుకోవాలని కోరారు. మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.2,400 కనీస మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్వావిళ్ల మనీలాసంజీవ్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి, కార్యదర్శి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
