ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రె

ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి  రాజ్ గోపాల్ రె
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  

చండూరు, వెలుగు : నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం లింగోటం వద్ద 70 ఎంఎల్ డీ నీరు లభిస్తున్నప్పటికీ దేవరకొండ నియోజకవర్గానికి ఇక్కడి నుండే తాగునీటి సరఫరా అవుతుందని తెలిపారు.

 దేవరకొండ నియోజకవర్గానికి ప్రత్యేకంగా 50 ఎంఎల్​డీ నీటిని అందించే విధంగా నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మిస్తామన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ప్రభుత్వ లెక్కల కంటే అధికంగా జనాభా నివసిస్తున్నారని, జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం మిషన్ భగీరథ నీరు సరిపోవడం లేదని చెప్పారు. ప్రజల కోసం పనిచేసే అధికారులు మాత్రమే ఇక్కడ ఉండాలని, టైంపాస్ చేసే అధికారులు ఉండొద్దని హెచ్చరించారు.  
చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదు

మునుగోడు, వెలుగు : ఎవరైనా చెరువులను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మునుగోడులోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. రికార్డుల ప్రకారం చేపట్టాల్సిన పనులను అధికారులకు ఆయన సూచించారు.