మండలానికో రిహాబిలిటేషన్ సెంటర్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మండలానికో రిహాబిలిటేషన్ సెంటర్ :  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు : పూర్తిగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగుల కోసం మండలానికి ఒక రిహాబిలిటేషన్​ సెంటర్ ను ప్రభుత్వం ద్వారానైనా లేదా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అయినా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపురం మండలం డాకుతండా, రాధానగర్ తండా, పోర్లగడ్డ తండాలో గురువారం ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తండాల్లో నెలకొన్న భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, పింఛన్లు, రోడ్ నెట్వర్క్ సమస్యలను గిరిజనులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. త్వరలోనే అన్ని తండాలకు లింక్ రోడ్లను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీనునాయక్, మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేశ్చందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వీరమల్ల భానుమతీవెంకటేశ్ గౌడ్, తహసీల్దార్​ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రమోద్ కుమార్, ఎంపీవో నరసింహారావు, ఎస్సై జగన్, నాయకులు ఉన్నారు.