రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అడ్డుకున్న స్థానికులు

మునుగోడు ఎమ్మెల్యేకు చుక్కేదురైంది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నాంపల్లి మండల స్థానికులు అడ్డుకున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలాన్నీ, చండూర్ రెవిన్యూ డివిజన్ లో కలపొద్దని.. నాంపల్లిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడినుంచి కదలనివ్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో నాంపల్లి మండలాన్ని చండూర్ రెవిన్యూ డివిజన్ కలుపొద్దని జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వండని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. చండూర్ రెవెన్యూ డివిజన్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేయడంతో ప్రభాకర్ రెడ్డి అక్కడ నుండి వెళ్లిపోయారు.