భువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ మంజూరు : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి

భువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ మంజూరు : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: భువనగిరికి డిగ్రీ రెసిడెన్షియల్​ కాలేజీ మంజూరైందని ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ కాలేజీ కోసం 10 ఎకరాలను సేకరించనున్నట్లు చెప్పారు. భువనగిరి, -వలిగొండ మధ్య ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ కోసం 20 ఎకరాలు, భువనగిరి, పోచంపల్లి, వలిగొండలోని రెసిడెన్షియల్​ స్కూల్స్​కు పక్కా భవనాలు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. భువనగిరిలోని ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​లో షాపులను వీధి వ్యాపారులకు అలాట్​ చేస్తామన్నారు. 

నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్​ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. భువనగిరిలోని డబుల్​ బెడ్రూం ఇండ్లను అనర్హులకు కేటాయించారని, వాటిని రద్దు చేస్తామని తెలిపారు. బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల నిర్మాణం వేగంగా సాగుతోందని చెప్పారు. ఈ కాల్వలు పూర్తయితే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్​ హనుమంతరావుతో కలిసి వివిధ అంశాలపై రివ్యూ నిర్వహించారు. పోత్నక్​ ప్రమోద్​ కుమార్​, పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉన్నారు.