అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి  

అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి  

యాదాద్రి, వెలుగు : అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం వలిగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డులు అందరికీ ఇవ్వరని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న పదేండ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు.

తాము ఇప్పుడు ఇస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విడతలవారీగా ప్రతిఒక్కరికీ కార్డులు అందిస్తామని చెప్పారు. రుణమాఫీ చేసినా.. చేయలేదంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా రుణమాఫీ పేరుతో డ్రామాలు ఆడిందని విమర్శించారు. ఈనెల 21న భువనగిరికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రానున్నారని తెలిపారు. పలు అభివృద్ధి పన లను ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.