అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో సౌకర్యాలు పరిశీలించిన ఎమ్మెల్యే

అడ్వా న్స్డ్  టెక్నాలజీ సెంటర్ లో సౌకర్యాలు పరిశీలించిన ఎమ్మెల్యే

హాలియా, వెలుగు: అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సెంటర్​ ప్రిన్సిపాల్​మల్లికార్జున్, అధికారులను ఎమ్మెల్యే  కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశించారు. హాలియా పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో  కలిసి పరిశీలించారు. సెంటర్​లో సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల రేషన్​కార్డులు రాలేదని, అలాంటివారు మళ్లీ అప్లై చేసుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు తక్కువగా మంజూరైన గ్రామాల్లో వెరిఫికేషన్ చేయించాలని కలెక్టర్​ను కోరారు.

వంతెన పనులకు శంకుస్థాపన

నాగార్జున సాగర్ లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, డిగ్రీ కళాశాల వద్ద రూ.25 లక్షలతో  నిర్మించనున్న వంతెన పనులకు ఎమ్మెల్యే, కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల, కళాశాలలో సమస్యలు తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు కేటాయించాలని, పైలాన్ కాలనీలోని బీఈడీ కళాశాల భవనాన్ని వాడుకునేందుకు అనుమతించాలని కోరగా.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ ​మండల అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.