​దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తాం : లక్ష్మారెడ్డి

​దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్  ఇస్తాం : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : సీఎం కేసీఆర్​ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.6,016 పింఛన్​ ఇస్తామని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను పలకరించారు. తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, కేసీఆర్​ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. 11సార్లు అధికారం చేపట్టి  ప్రజలకు కనీస స్థాయిలో సౌలతులు కల్పించలేని కాంగ్రెస్  పార్టీ తీరును ఎండగట్టారు.

వ్యవసాయానికి 24  గంటల కరెంట్, పింఛన్లు, రైతు బీమా గురించి విస్తృత ప్రచారం చేశారు. అలాగే బీఆర్ఎస్​ హయాంలోనే ప్రాజెక్టుల పనులు స్పీడ్​గా సాగుతున్నాయన్నారు. కాగా, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూతురు స్ఫూర్తిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టణంలోని ఓ హోటల్​లో దోశలు వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే మున్సిపల్​ చైర్​పర్సన్​ లక్ష్మి, కౌన్సిలర్లు చౌహాన్, కొండల్, ప్రశాంత్​రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.