జర్నలిస్టులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

జర్నలిస్టులకు అండగా ఉంటాం :  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
  •  ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: జర్నలిస్టులకు అండగా ఉంటామని, వారికి ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ నిర్మల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాసం శ్రీధర్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జర్నలిస్టులు చేపట్టిన రిలే దీక్షా శిబిరం వద్దకు శుక్రవారం మహేశ్వర్​రెడ్డి సంఘీభావం తెలిపారు. వారికి మద్దతు ప్రకటించి మాట్లాడారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించే అక్షర యోధులైన జర్నలిస్టులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. 

వారికి వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.  అసెంబ్లీ లో ఈ విషయంపై మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు ఉన్నారు.  ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చక్రధారి, డాక్టర్ కృష్ణంరాజు తదితరులు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు.

 నిర్మల్ లో జర్నలిస్టుల భారీ ర్యాలీ

అంతకుముందు జర్నలిస్టులు నిర్మల్​లోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికి ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చక్రధారి, డాక్టర్ కృష్ణంరాజు తదితరులు మద్దతు ప్రకటించారు.