రాయపర్తి, వెలుగు: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో శనివారం ఉచిత చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో ఉచిత చేపపిల్లలను వదులుతామని చెప్పారు.
మత్స్యకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, మత్యశాఖ జిల్లా అధికారి నాగమణి, ఎంపీడీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్, మైలారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోయిని కుమార్ తదితరులు పాల్గొన్నారు.