
తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం నిర్వహించిన రేవంత్ రెడ్డి సభ విజయవంతమైందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం సభకు మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారని, ఇది చూసి బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
అడ్డగూడూరు, నాగారం మండలాలకు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు సీఎం నిధులు మంజూరు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కాలు గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసిన మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వై.నరేశ్, నాయకులు మూల అశోక్ రెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, కృష్ణ, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.