గోదావరిఖనిలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

గోదావరిఖనిలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి :  ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

గోదావరిఖని, వెలుగు: దసరా ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం రామగుండం కార్పొరేషన్​ ఆఫీస్‌‌‌‌లో నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడారు. బతుకమ్మ, దసరాను ప్రజలు ఉత్సహంగా జరుపుకునేందుకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాల అధికారులు సహకరించాలని కోరారు. గతేడాది సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో విజయదశమిని ఘనంగా నిర్వహించినట్టు చెప్పారు.

 ఈసారి ఎన్టీపీసీ, ఆర్​ఎఫ్​సీఎల్​ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించే వారు పూర్తిగా రోడ్డును ఆక్రమించడం, తవ్వడం చేయొద్దన్నారు. అంతకుముందు చెత్త సేకరణ కోసం రూ.58 లక్షలతో కొన్న ఏడు ఆటోలను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్, మున్సిపల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌​ అరుణ శ్రీ, ఈఈ రామన్​, సింగరేణి జీఎం డి.లలిత్​ కుమార్, సివిల్​ డీజీఎం వరప్రసాద్​, ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌, అడిషనల్​ కమిషనర్​ మారుతి, డిప్యూటీ కమిషనర్​ వెంకటస్వామి, ఆర్ఎఫ్‌‌‌‌సీఎల్​ మేనేజర్​ శుక్లా, వంశీకృష్ణ, ఎన్​పీడీసీఎల్​ డీఈ ప్రభాకర్​, ఏడీఈ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.