
గోదావరిఖని, వెలుగు: రామగుండంలో అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆదేశించారు. బుధవారం జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. గోదావరిఖనిలో గోదావరి బ్రిడ్జి వద్ద సమ్మక్క–సారలమ్మ జాతర గద్దెల అభివృద్ధి పనులు, నది ఒడ్డున శ్మశాన వాటిక నిర్మాణ పనులు, రామగుండం మసీదు టర్నింగ్, రామగుండం జడ్పీ హైస్కూల్, రైల్వే స్టేషన్ ఎదురుగా జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట జంక్షన్ అభివృద్ధి, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.
19న 'ఖని'లో దీపావళి వేడుకలు
గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ఈ నెల 19న దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నట్టు సింగరేణి ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్ తెలిపారు. బుధవారం జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్హాల్లో జరిగిన మీటింగ్‌లో ఉత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సినీ నటులు ఆలీ, శివారెడ్డి, గాయనీ గీతామాధురి, జబర్దస్త్ హాస్య నటులు, డ్యాన్సర్లతో కార్యక్రమాలుంటాయని జీఎం వివరించారు.