
గోదావరిఖని, వెలుగు :నియోజకవర్గంలో ఎవరైనా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్ కాలనీ వద్ద కొత్తగా నిర్మించిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గతంలో చిందరవందరగా ఉన్న షాప్‌లను తొలగించి ప్రస్తుతం ప్రణాళికా బద్ధంగా వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశామన్నారు.
ఎవరినీ బాధ పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని పేర్కొన్నారు. పట్టణ ప్రధాన చౌరస్తాలో ప్రత్యేక వ్యాపార సముదాయాలు, విశాలమైన రహదారులు, ఓల్డ్ అశోక్ వద్ద కాంప్లెక్స్, పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రత్యేక సముదాయం, తిలక్ నగర్లో కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్యాంప్ ఆఫీస్‌లో అంతర్గాం గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.