వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు 

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు 

కోదాడ, వెలుగు : నియోజకవర్గంలో ఇటీవల వర్షాలు, వరదలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధికారులకు సూచించారు.మంగళవారం కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి, కోదాడ, చిలుకూరు మండలాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు. నియోజకవర్గంలో వరద సహాయక చర్యలను పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. ఆమె వెంట రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 

మన సంస్కృతిని పండగలే గుర్తుచేస్తాయి..

మేళ్లచెరువు(హుజూర్​నగర్), వెలుగు : మన సంస్కృతి, సంప్రదాయాలను పండగలు గుర్తు చేస్తాయని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. హుజూర్​నగర్ పట్టణంలోని మూడో వార్డు లో జరిగిన గణేశ్ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.