ప్రజా సేవలో అల్లం ఉమారాణి ముందుండేవారు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

ప్రజా సేవలో అల్లం ఉమారాణి ముందుండేవారు : ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

హుజూర్ నగర్, కోదాడ, వెలుగు : ప్రజా సేవలో అల్లం ఉమారాణి ముందుండేవారని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో ఉమ్మడి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ అల్లం ప్రభాకర్ రెడ్డి భార్య అల్లం ఉమారాణి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లం ఉమారాణి మరణం తీరనిలోటని, ఆమె అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు ఈడ్పుగంటి సుబ్బారావు, ఐఎన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్, నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, గెల్లి రవి, కోలపుడి యోహాన్, కొండ నాయక్, డాక్టర్ శివప్రసాద్ పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు చేయడం భినందనీయం..

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం కోదాడలో ఆయన అభిమాన సంఘం ఆధ్వర్యంలో పాటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.