సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ

సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ

బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్​ఎఫ్​చెక్కులను పంపిణీ చేశారు. సోమవారం మండలానికి చెందిన 62 మందికి రూ.17.11 లక్షలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరిలో నీళ్లున్నా చెరువులు నింపి రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమయ్యిందని విమర్శించారు.

 జనగామ నియోజకవర్గంలోని గండిరామారం, హనుమంతాపూర్, తపాసుపల్లి, వెల్దండ, లద్నూరులాంటి రిజర్వాయర్లు నింపాలని డిమాండ్​ చేశారు. తనను గెలిపించినందుకు ఇచ్చిన హామీ మేరకు నీలిమా ఆసుపత్రిలో నియోజకవర్గానికి చెందిన రోగులకు రోజుకు 300 నుంచి 350 మందికి ఉచితంగా వైదం అందిస్తున్నట్లు తెలిపారు. పీఎసీఎస్​చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్, జిల్లా రైతుబంధు మాజీ కన్వీనర్ రమాణారెడ్డి పాల్గొన్నారు.