- ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల, వెలుగు : పేదోడి సొంతింటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ దేనని పినపాక ఎమ్మెల్యే పాయంవెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి వాంకుడోత్ బికోజి గెలుపును ఆకాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండాల, ఆళ్లపల్లి మండలాల్లోని ఏ గ్రామానికి వెళ్లినా ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారన్నారు.
ఫస్ట్, సెకండ్ విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని, అదే తరహాలో మూడో విడత కూడా ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పేదోడికి ఇల్లు, సన్న బియ్యం, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఓటర్లు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పీఎస్ఆర్, పీవీఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఎస్కే ఖదీర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దార అశోక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొంబోయిన ముత్తయ్య, మాజీ ఎంపీపీ చాట్ల పద్మ, ఆయా గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీలో ఉన్న అభ్యర్థులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
