బీసీ లీడరే ముఖ్యమంత్రి : రఘునందన్ రావు

బీసీ లీడరే ముఖ్యమంత్రి  : రఘునందన్ రావు

వెలుగు, తొగుట (రాయపోల్): రాబోయే బీజేపీ ప్రభుత్వంలో బీసీ లీడరే ముఖ్యమంత్రి అవుతాడని ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గురువారం రాయపోల్ మండలంలోని మాంతూర్, చిన్న మాసన్ పల్లి, ఆరేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. త్వరలోనే ఆరేపల్లి గ్రామాన్ని రాయపోల్ మండలంలో విలీనం చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తునక చేస్తామన్న సీఎం కేసీఆర్​ కేవలం తన కుటుంబాన్ని మాత్రమే బంగారు మయం చేశారని ఎద్దేవా చేశారు.

 ముస్లిం మహిళల కోసం త్రిబుల్ తలక్ చట్టాన్ని తెచ్చి వారికి న్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వమే అని గుర్తుచేశారు.  త్వరలోనే ఎస్సీ వర్గీకరణ కోసం పార్లమెంట్లో బిల్లును పెట్టే యోచలనో ఉందన్నారు. కాంగ్రెస్​కు ఓటేస్తే వారు మళ్లీ బీఆర్ఎస్​వారికే అమ్ముడుపోతారన్నారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. గ్రామాల్లో వేసే సీసీ రోడ్లు, జీపీ భవనాల నిర్మాణం, రోడ్లు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే అని వివరించారు. ప్రజల కోసం అసెంబ్లీ లో కొట్లడే లీడర్లనే ప్రజలు గెలిపించాలని కోరారు. 

ALSO READ: ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలి : పృధ్వీరాజ్

అనంతరం వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు. నర్సింగ్ మండలంలోని నర్సంపల్లి, పెడ్డతండ, వల్లభ పూర్, వల్లుర్, భీమ్ రావు పల్లి లో ప్రచారం కొనసాగించారు.   కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు రామచంద్రం, మంకిడి స్వామి, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హరికృష్ణ, ప్రభాకర్ రెడ్డి, రవీందర్ గౌడ్, నర్సింలు, ఆంజనేయులు, రామస్వామి పాల్గొన్నారు.