భవిత కేంద్రాల్లో ఆటపాటలతో విద్య : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

భవిత కేంద్రాల్లో ఆటపాటలతో విద్య : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : దివ్యాంగులకు ఆటపాటలతో విద్యను అందించడానికి ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి భవిత కేంద్రాన్ని ప్రారంభించారు.

 మానసిక శారీరక ఎదుగుదల లేని విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి చాక్లెట్లు పంపిణీ చేశారు. అనంతరం నాంపల్లి మండలం నర్సింహులగూడెంలో 33/11 సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. 

నరసింహులగూడెం చేరుకున్న ఎమ్మెల్యేకు గిరిజన దుస్తులను తొడిగి గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవో శ్రీదేవి, డీఈవో భిక్షపతి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.