నాగర్ కర్నూల్ లో నీటి సమస్య తీర్చేందుకు ట్యాంక్ నిర్మాణం : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ లో నీటి సమస్య తీర్చేందుకు ట్యాంక్ నిర్మాణం : ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పట్టణంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.36 కోట్లతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని జిల్లా గ్రంథాలయం సమీపంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. 

ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నల్లవెల్లి రోడ్డులో రూ.3 కోట్లతో నిర్మించిన సీసీరోడ్డును ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు సునేంద్ర, నిజాముద్దీన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.