
- వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
పాల్వంచ, వెలుగు: గిరిజన నాయకుడు బానోతు కిషన్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైరా ఎమ్మెల్యే బానోతు రాందాస్ నాయక్ భరోసా ఇచ్చారు. కొత్తగూడెంలో హాస్పిటల్ నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కిషన్ నాయక్ సంస్మరణ సభ శనివారం పాల్వంచలో జరిగింది. ఎమ్మెల్యే హాజరై కిషన్‌నాయక్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రంగా కిరణ్, కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని, ఎడవల్లి కృష్ణ పాల్గొన్నారు.
కాంట్రాక్టర్‌కు నివాళి..
గట్టాయిగూడేనికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ పైడిపల్లి మనోహర్ రావు(62) శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నివాళి అర్పించారు.