మహిళా డెయిరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

మహిళా డెయిరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

హనుమకొండ సిటీ, వెలుగు: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సమగ్రప్రణాళికను రూపొందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీశ్, సత్య శారదాదేవి, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల మహిళా డెయిరీ ద్వారా పాలు, పాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ డెయిరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. వరంగల్ కలెక్టర్ మాట్లాడుతూ పాలు, పాల ఉత్పత్తికి మంచి బ్రాండ్ తీసుకురావాలని ఆకాంక్షించారు, సమావేశంలో రెండు జిల్లాల డీఆర్డీవోలు మేను శ్రీను, కౌసల్యదేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

హాస్పిటల్స్ రూల్స్ పాటించాలి

స్కానింగ్ సెంటర్లు ఉన్న అన్ని ఆస్పత్రులు ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా వివిధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ చట్టం పరిధిలో రిజిస్టర్ అయిన సెంటర్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. 

లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లింగ నిర్దారణ, అబార్షన్లు నిర్వహించే వారి గురించి 6300030940కి సమాచారం ఇచ్చేందుకు ప్రతి ఆశా కార్యకర్త, అంగన్ వాడీ కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జీ క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ లీగల్ వలంటీర్ల ద్వారా  లింగనిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన  కార్యక్రమాలు  నిర్వహిస్తామని, వైద్య ఆరోగ్యశాఖకు సహకరిస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో అప్పయ్య, స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తనిఖీలు చేసి 8 సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.