అంగన్​వాడీల సమస్యలు పరిష్కరించాలి : సీతా దయాకర్​రెడ్డి

అంగన్​వాడీల సమస్యలు పరిష్కరించాలి : సీతా దయాకర్​రెడ్డి

మక్తల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అంగన్​వాడీ కార్యకర్తలు, ఆయాల సమస్యలు వెంటనే పరిష్కారించాలని మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్​రెడ్డి డిమాండ్​ చేశారు. అంగన్​వాడీలు చేస్తున్న రిలే దీక్షలు శుక్రవారం 12వ రోజుకు చేరుకోగా, దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. 

Also Read :- మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన నవదీప్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 70 వేల మంది ఉద్యోగులు చాలీచాలని వేతనంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. వీరందరిని ప్రభుత్వం  పర్మినెంట్  చేయాలని డిమాండ్  చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, గోవింద్ రాజ్, విజయలక్ష్మి, మంజుల, నర్సింగమ్మ, సుజాత, అనిత, అనురాధ, రాజేశ్వరి, రాధిక, భాగ్యలక్ష్మి, సునీత, గిరిజ, వాహిదా బేగం, వెంకటమ్మ. ఉమాదేవి, మణెమ్మ, శ్రీలత, తిరుపతమ్మ, ప్రమీల, పద్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

 

నిర్బంధాలతో సమ్మెను ఆపలేరు..

మహబూబ్ నగర్ టౌన్: నిర్బంధాలతో అంగన్​వాడీల సమ్మె ఆపలేరని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్  పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీచర్లు, హెల్పర్లను సస్పెండ్  చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. జీతాలు పెంచుతామని, గ్రాట్యుటీ, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. పుష్పలత, ప్రభావతి, నీలావతి, కమల, గౌస్య బేగం, సత్తమ్మ, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.