ప్రతీ డివిజన్ ను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

ప్రతీ డివిజన్ ను  అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్​నగర్​అర్బన్, వెలుగు: ప్రతీ డివిజన్​ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్​రెడ్డి అన్నారు. 9వ వార్డులోని వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో రూ.9.50 లక్షలతో నిర్మించనున్న మల్టీ పర్పస్ షెడ్, 20వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో రూ. 8 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బాలాజీనగర్ లో రూ.3 కోట్లతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. లైబ్రరీ చైర్మన్ నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అనిత   పాల్గొన్నారు. 

పదో డివిజన్​ సమస్యలు పరిష్కరించాలి

మహబూబ్ నగర్ టౌన్: నగరంలోని 10వ డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం నాయకుడు ఆది విష్ణు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, మినీ ఫంక్షన్ హాల్ ​నిర్మించాలని కోరారు.  

యారోనిపల్లికి రోడ్డు వేయండి

హన్వాడ: వేపూర్ మెయిన్ రోడ్డు నుంచి యారోనిపల్లి వరకు రోడ్డు వేయాలని సర్పంచ్ ​స్వాతి కోరారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాస్​రెడ్డికి వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో మట్టిరోడ్డు బురదగా మారి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కోరారు.   ఉపసర్పంచ్ మైబమ్మ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.