తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

భద్రాచలం, వెలుగు: చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి సోమవారం పంట కాల్వలకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నీటిని విడుదల చేశారు. తాలిపేరు జలాలకు ప్రత్యేక పూజలు చేసి, పసుపు, కుంకుమ, పూలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రధాన ఎడమ, కుడి కాల్వల హెడ్  రెగ్యులేటర్స్  వద్ద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో పని చేసి పొలాలకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించాలని ఆదేశించారు. 

రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. తాలిపేరు ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని 25 వేల ఎకరాలకు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని అందించనున్నారు. డీఈ తిరుపతి, సొసైటీ చైర్మన్​ పరుచూరి రవికుమార్, రైతు క్లబ్​ చైర్మన్​ కొత్తపల్లి ఆంజనేయులు, తహసీల్దార్​ శ్రీనివాస్, ఎంపీడీవో ఈరయ్య, ఏవో లావణ్య, ఏఈ సంపత్  పాల్గొన్నారు.