సార్ ను జైలుకు పంపడం ఖాయం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

సార్ ను జైలుకు పంపడం ఖాయం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: వనపర్తిలోని బీఆర్ఎస్​ నేత అవినీతి, అక్రమాలను ఒక్కొక్కటిగా బయటి తీశామని, సారును జైలుకు తప్పక పంపుతామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వనపర్తిలో రూ.256 కోట్లతో నిర్మించి 500 పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారు. 

అనంతరం మాట్లాడుతూ..మాందాపూరులోని సారు గెస్ట్​ హౌజ్​కు ఫ్రీ కరెంట్ తీసుకుంటే కట్​ చేయించామని, వెల్టూరులో 50హెచ్​పీ మోటారుతో అక్రమంగా నీటిని తోడుతుంటే ఆపామని, గద్వాలలో కృష్ణానది పక్కన 2.20 ఎకరాల భూమిని కబ్జా చేస్తే గద్వాల కలెక్టర్​తో చెప్పి సర్వే చేయించి ఫెన్సింగ్​ వేయించామన్నారు.

 ఆయన మీద, ఆయన దత్తపుత్రుల మీద ఎఫ్​ఆర్ఐ చేయించామని, ఇన్​కం టాక్స్​ ఎఫ్​ఆర్ఐ చేయించామని పేర్కొన్నారు. తాను 23 నెలల్లో చేసిన అభివృద్ధిపైన, ఆరోపణలపై చర్చకు రమ్మని పిలిస్తే ఆయన కానీ ఆయన శిష్యులు కాని రాలేదన్నారు.  కేసీఆర్​ కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీశ్, ఆయన సడ్డకుడు సంతోష్​ కలిసి రూ.లక్ష కోట్లు సంపాదించారని చెప్పామని పంపకాల్లో భాగంగానే కవితను బయటకు తోశారని ఆరోపించారు. 

వనపర్తిలో ఒకరు అభివృద్ధి పేరుతో పట్టణాన్ని ధ్వంసం చేసి అందరి పై కేసులు పెట్టించారని విమర్శించారు. ఆయన అవినీతి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్​, సీబీఐకి ఫిర్యాదు చేశామని, తప్పులు బయటపడితే జైలుకు పోవుడు ఖాయమని, చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూమ్​ కట్టిస్తామని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్​రెడ్డి 2023, మార్చి 2న  ఫౌండేషన్​ వేసిన పనులకు  డీపీఆర్​ టెండర్స్​ పూర్తి చేశామన్నారు. 

ఎన్నికల్లో కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పారని, ఇప్పటికీ అవకాశముందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవిని బీసీకి, అసెంబ్లీలో ఆపోజిషన్​ లీడర్​ పదవిని ఎస్సీకి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కవిత చేసిన ఆరోపణలు తప్పయితే మాజీ మంత్రి వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, బీచుపల్లిలోని ఆంజనేయ ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసి తప్పని చెప్పాలని డిమాండు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చీర్ల చందర్​, సతీశ్, రహీం, కృష్ణ  పాల్గొన్నారు.