బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నీటి విడుదలతో రైతుల్లో ఆనందం : ఎమ్మెల్యే వేముల వీరేశం

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నీటి విడుదలతో రైతుల్లో ఆనందం : ఎమ్మెల్యే వేముల వీరేశం

నార్కట్​పల్లి, వెలుగు: బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నీటితో చెరువులు నింపుతున్న నేపథ్యంలో  రైతుల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నార్కట్​పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో పంటలకు నీరందిస్తున్నామని చెప్పారు. కుడి కాల్వ ద్వారా గోపాలయపల్లి, నార్కట్​పల్లి, ఏడవల్లి, ఏపీ లింగోటం గ్రామాల్లో చెరువులు నింపుతున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ఈ ప్రాజెక్టుపై విపక్ష చూపిందని ఆరోపించారు.

  బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు  ద్వారా నకరికల్ నియోజకవర్గంలో 62 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. అనంతరం నార్కెట్​పల్లి బస్ డిపోలో మూడు కొత్త బస్సులను ప్రారంభించారు. త్వరలో షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈఈ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు బత్తుల ఊషయ్య గౌడ్, నాయకులు బండ సాగర్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, వడ్డె భూపాల్ రెడ్డి, నేతగాని 
కృష్ణయ్య,శశిధర్ రెడ్డి, జేరిపోతుల భరత్ తదితరులు పాల్గొన్నారు.