
- ఎమ్మెల్యే వేముల వీరేశం
నార్కట్పల్లి, వెలుగు : పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో 414 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు ఇస్తుంటే పేదల ముఖంలో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
ప్రతి పేదోడి సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఉమేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉషయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు బండ సాగర్ రెడ్డి, అలుగుబెల్లి రవీందర్ రెడ్డి, సట్టు సత్తయ్య, వడ్డే భూపాల్ రెడ్డి, బింగి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.