చిట్యాలలో అర్హులందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాలలో అర్హులందరికీ రేషన్ కార్డులు : ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, వెలుగు : ప్రజా పాలనలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాలలోని బీఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దరఖాస్తులు తీసుకున్నారు తప్ప.. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మండలంలో 1600 రేషన్​కార్డులు, 500లకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. 

రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద - మోహన్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి, నాయకులు కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి, జడల చిన్న మల్లయ్య, ఏనుగు రఘునాథ్ రెడ్డి, గుడిపాటి లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు. 

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

కేతేపల్లి, నకిరేకల్ : కాంగ్రెస్​హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.  సోమవారం కేతేపల్లిలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.