
పెద్దపల్లి/సుల్తానాబాద్ వెలుగు: విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికే అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ క్యాంపస్‌లో శనివారం ఏటీసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగుపరుస్తున్నామన్నారు.
అంతకుముందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సుల్తానాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, పద్మశాలి సంఘం లీడర్లు రామ్మూర్తి, మహేందర్, రమేశ్ పాల్గొన్నారు.