ఏఐసీసీ ప్రెసిడెంట్​ను కలిసిన ఎమ్మెల్యే వినోద్

ఏఐసీసీ ప్రెసిడెంట్​ను కలిసిన ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, వెలుగు: ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేను బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి కలిశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం కుటుంబసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. భార్య రమ, కూతురు వర్ష, మనుమడు, మనువరాలితో కలిసి ఖర్గేను శాలువాతో సన్మానించారు. వినోద్ సోదరుడు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందడం అభినందనీయమని ఖర్గే అన్నారు. వినోద్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని చోట్లా గెలిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఖర్గేతో పలు విషయాలు చర్చించినట్లు వినోద్ తెలిపారు.