- హక్కుల సాధనకు మాల సంఘాలన్నీ
- ఒక్కటవ్వాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సూర్యాపేటలో మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే
సూర్యాపేట, వెలుగు: మాల జాతి హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సమాజంలో మాలలకు సరైన గౌరవం దక్కేందుకు మాల ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కాకా వెంకటస్వామి బడుగు, బలహీన వర్గాల కోసం పార్లమెంటులో కొట్లాడారని, ఆయన ఎప్పుడు మాల, మాదిగ అన్న భేదం చూడలేదన్నారు.
ఎస్సీలందరూ బాగుండాలని భావించి అప్పట్లో సీఎం చెన్నారెడ్డితో కొట్లాడి నలుగురు ఎస్సీ కలెక్టర్లకు, నలుగురు ఎస్సీ ఎస్పీలకు పోస్టింగ్ ఇప్పించారని గుర్తుచేశారు. మాల సంఘాలు ఏక తాటిపైకి వస్తేనే హక్కులు సాధించుకోవచ్చని చెప్పారు. అధికారంలో ఉన్న నాయకులు మాలలను వాడుకోవాలని చూశారు తప్ప మాల జాతి పరిరక్షణ కోసం ఎలాంటి కృషి చేయలేదన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కూడా తాను భయపడలేదని, మాల జాతి కోసం తమ కుటుంబం నిరంతరం పోరాటం చేస్తుందని వివేక్ చెప్పారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీమ్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. రాజ్యాంగ ఫలాలు అందరికి చేరేలా కృషి చేయాలన్నారు. జాతి రక్షణ కోసం అందరూ ఐక్యంగా ఏర్పడి, టీమ్‌గా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, అన్నేపర్తి జ్యాన్ సుందర్, తల్లమల్లా హుస్సేన్, డాక్టర్ గోపీనాథ్, మేకల రవీందర్, ఎర్రమల్ల రాములు, జంగం కరుణాకర్, అనుములపురి కృష్ణ, వేణు బలరాం, రత్తయ్య, మందాల భాస్కర్, మామిడి నారాయణ, లక్ష్మీ నారాయణ, రవి కుమార్, అనుములపురి జానకి రాములు, చింత వెంకటేశ్వర్లు, బోల్లెద్దు బుచ్చిరాములు, బొల్లెద్దు దశరథ, అనుములపురి భద్రాచలం, వెంకన్న, ముక్కంటి, కృష్ణ, వేణు, గిరిబాబు, రఘు, వెంకన్న, శివయ్య, నాగయ్య, రామకృష్ణ సుందర్, సంజయ్, కరుణాకర్, రవి, సైదులు, మురళి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.